ISRO: ఉపగ్రహ ప్రయోగాల్లో కొత్త మైలురాయి 4 d ago

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఘన విజయం సాధించింది. 300 మిల్లీన్యూటన్ల సామర్థ్యమున్న స్టేషనరీ ప్లాస్మా థ్రస్టర్(300 MN STATIONARY PLASMA THRUSTER) ను 1000 గంటల పాటు పరీక్షించి విజయవంతంగా పరీక్షించింది. ప్రస్తుతం ఉప గ్రహాలను ఒక కక్ష్యలో స్థిరంగా ఉంచటానికి, ఒక కక్ష్య నుంచి మరొక కక్ష్యలోకి పంపించడానికి 'రసాయనిక ప్రొపల్షన్ వ్యవస్థలను' వినియోగిస్తున్నారు. అయితే ఇవి అధిక ఇంధన వినియోగంతో పాటు ఉపగ్రహాల బరువును పెంచుతున్నాయి.
ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్రో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఉపగ్రహ ప్రయోగాల్లో ఈ కొత్త సాంకేతికత వినియోగించేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ను ఇస్రో టెక్నాలజీ డెమోన్టే స్టేషన్ ఉపగ్రహం (TDS01)లో ఉపయోగించేందుకు ప్రణాళికలు చేసింది. భూస్థిర కక్ష్యను పెంచడానికి ఉపయోగించబడుతుంది.
ప్రయోజనాలు..
ఈ కొత్త సాంకేతికతతో ఉపగ్రహాల బరువును గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ట్రాన్స్పాండర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ థ్రస్టర్లు జీనానన్ను ప్రొపెల్లెంట్గా ఉపయోగించుకుంటాయి. రాకెట్లలో వాడే ఇంధన వినియోగం తగ్గుతుంది. తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం కలిగిన ప్రయోగాలు చేపట్టొచ్చు. ఇక పై ఉపగ్రహాలను ఒక కక్ష్యలో స్థిరంగా ఉంచేందుకు, ఒక కక్ష్య నుంచి మరొక కక్ష్యలోకి పంపించేందుకు సులభం అవుతుంది.